
500 కిలోల గంజాయి స్వాధీనం
● జిల్లా వ్యాప్తంగా అబ్కారీశాఖ దాడులు
● గంజాయి, నాటుసారా, మద్యం పట్టివేత
● ఐదుగురు అరెస్టు
పర్లాకిమిడి: గజిపతి జిల్లా కలెక్టర్ మధుమిత ఆదేశాల మేరకు జపతి జిల్లా అబ్కారీశాఖ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు మంగళవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గంజాయి, సారాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. వీరిలో ఒక మహిళ ఉంది. జిల్లాలో గుసాని సమితి గారబంద పి.ఎస్.పరిధిలో అడాసింగి, రాయఘడ బ్లాక్ మర్లబ, గుమ్మా బ్లాక్ సెరంగో పి.ఎస్.పరిధిలో బారై తదితర గ్రామాల్లో 500 కిలోల గంజాయి, 20 లీటర్ల బెల్లం ఊట, 30 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక బైక్, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఆర్.ఉదయగిరి అబ్కారీ శాఖ అధికారి మోన్ను ఆయాల్, మోహనా ఎస్‌ఐ కె.బాలాజీ, పర్లాకిమిడి సదర్ ఎకై ్సజ్ ఎస్‌ఐ ప్రశాంత్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.