
జాతీయ పోటీలకు నడగాం విద్యార్థి
నరసన్నపేట: జాతీయ స్థాయి యోగాసన పోటీలకు మండలంలోని నడగాం గ్రామానికి చెందిన బొత్స మనోహర్‌నాథ్ ఎంపికయ్యాడు. డిసెంబర్ 27 నుంచి 30వ తేదీ వరకూ రాంచీలో యోగా స్పోర్ట్స్ చాంపియన్–2025 పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో మనోహర్‌నాథ్ పాల్గోనున్నట్లు తండ్రి కేదారనాథ్ వెల్లడించారు. సెప్టెంబర్ 6, 7వ తేదీల్లో ఏపీ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలు తిరుమలలో జరిగాయన్నారు. ఈ పోటీల్లో మనోహర్‌నాథ్ కాంస్య పతకం సాధించినట్లు వెల్లడించారు. ఈ మేరకు జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ తరుపున పాల్గోనున్నట్లు వివరించారు. కాగా తమ గ్రామానికి చెందిన బాలుడు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంపై గ్రామానికి చెందిన నాయకులు లుకలాపు రవి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు.