
సమస్యలకు పరిష్కారం చూపాలి
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుమ్మా బ్లాక్ భుభుని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రామముఖి పరిపాలన, స్పందన కార్యక్రమం నిర్వహించారు. అదనపు జిల్లా మాజిస్ట్రేట్ ఫాల్గుని మఝి, జిల్లా ఎస్పీ జ్యోతింద్రపండా, ముఖ్యకార్యనిర్వాహణ అధికారి, జిల్లా పరిషత్ శంకర్ కెరకెటా, సబ్ కలెక్టర్ అనుప్ పండా తదితరులు హాజరయ్యారు. భుభని పంచాయతీతో సహా సెరంగో, అజయగడ, తుమ్ములో గ్రామాల నుంచి 62 వినతులు అందాయి. వాటిలో వ్యక్తిగతం 18 కాగా, గ్రామ సమస్యలకు సంబంధించినవి 43 ఉన్నాయి. వీటిని సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కారం చూపాలని ఏడీఎం మఝి ఆదేశించారు. గ్రీవెన్స్‌కు గుమ్మా సమితి అధ్యక్షురాలు సునేమీ మండల్, బీడీఓ దులారాం మరాండి, తహసీల్దార్ శరత్ శోబోరో, సీడీఎంఓ డాక్టర్ ఎం.ఎం.ఆలీ, బ్లాక్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
మాన్యంకొండలో..
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మాన్యంకొండ పంచాయతీలో సోమవారం జిల్లా కలేక్టర్ సోమేశ్ ఉపాధ్యయ్ గ్రీవెన్స్ నిర్వహించారు ప్రజాల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధింత అధికారులకు ఆదేశించారు. అనంతరం మాన్యంకొండ పంచాయతీలో పర్యటించి గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అటవిశాఖ అధికారి సాయికిరణ్, సబ్ కలెక్టర్ అశ్ని, కలిమెల బీడీఓ, సహ జిల్లా ఎన్నికల అధికారి ఆశోక్ చక్రవర్తి, జిల్లా అభివృద్ధిశాఖ అధికారి నరేశ్ శభరో, పలుశాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

సమస్యలకు పరిష్కారం చూపాలి

సమస్యలకు పరిష్కారం చూపాలి