
ఆదివాసీలను ఆదుకోవాలి
పర్లాకిమిడి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాీసీ వ్యతిరేక విధానాలను విడనాడాలని గజపతి జిల్లా మోహనా బ్లాక్ భగ్గమర్రి పంచాయతీ శికులిపదర్ గ్రామంలో ఆదివాసీ సంఘర్ష మోర్చా (ఏ.ఎస్.ఎం) ఆధ్వర్యంలో సోమవారం సభ నిర్వహించారు. తొలుత సికులిపదర్ గ్రామం నుంచి మోహనా సంతపేట వరకు ఆదివాసీ సంఘర్ష మోర్చా, సి.పి.ఎం (లిబరేషన్) కార్యకర్తలు, రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి గోమాంగో, నర్సింహ మండల్, కేశబ రైయితో తదితరులు నాయకత్వం వహించి ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో మొక్కజోన్న పంటకు మద్దతుధర, మండీలు ఏర్పాటుచేసి కిలోకి వంద రూపాయలు బోనస్, రైతులకు 50 కిలోల బియ్యం, మన్‌రేగా ఉపాధి పనుల కూలీలకు రూ.600 మంజూరు, పెన్షన్ రూ.5 వేలు, లుహాగుడి పంచాయతీ దంతరినల్లా గ్రామం అంగన్‌వాడీ పనులు పూర్తిచేయాల ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరి ట అడవులు నాశనం చేస్తున్నారని, ఆదివాసీ భాష, సంస్కృతిని రాజ్యాంగ అధికారం ఇవ్వాలని తిరుప తి గోమాంగో డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆదివాసీల కష్టాలను గుర్తించకుండా పెద్ద, పెద్ద కంపెనీలకు అటవీ భూములు కట్టబెడుతున్నాయని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆదివాసీలకు రాజ్యాంగ హక్కు కల్పించకుంటే సమీప భవిష్యత్‌లో ఆందోళన తీవ్ర తరం చేస్తామని తిరుపతి గోమాంగో అన్నారు. ఈ ఆందోళనలో మాఽథ్యూమండళ్, డంగల్ రయితో, తమాస్ రయితో, కేశవ్ రయితో, జోహాన్ రయితో, ఎలియా గోమాంగో, సర్బశ్రీ గోమాంగో తదితరు లు పాల్గొన్నారు.