
ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది: గవర్నర్
● కొరాపుట్‌లో గవర్నర్ పర్యటన ప్రారంభం
కొరాపుట్: ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుందని గవర్నర్ డాక్టర్ కె.హరిబాబు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రా–ఒడిశా వివాదాస్పద ప్రాంతం కొఠియాపై మీడియా ప్రశ్నించగా బదులిచ్చారు. కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కొఠియాలో పర్యటిస్తారా అని ప్రశ్నించగా తన పర్యటన కొరాపుట్, మల్కన్‌గిరి జిల్లాలలో అనుకున్న విధంగా సాగుతుందన్నారు. అనంతరం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని కాఫీ బోర్డుని సందర్శించారు. అక్కడ కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్ కాఫీ బోర్డు ప్రాముఖ్యత వివరించారు. కాఫీ మొక్కలు, గింజలు, వాతావారణం గవర్నర్ పరిశీలించారు. కొరాపుట్‌లో పండిన కాఫీ గింజలతో చేసి న కాఫీని ఆస్వాదించి, రుచి అద్భుతంగా ఉందన్నారు. అనంతరం రైతులతో సంభాషించారు. కొరాపుట్ కాఫీ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకు న్న విషయం కాఫీ బోర్డు ఉన్నతాధికారులు గవర్నర్‌కి వివరించారు. అంతకు ముందు భువనేశ్వర్ నుంచి జయపూర్ ఎయిర్ పోర్టుకి చేరుకున్న గవర్నర్‌కు అధికారులు, బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన రోడ్డు మార్గాన కొరాపుట్ పట్టణానికి చేరుకున్నారు. సాయంత్రం భారత అల్యూమినియం కేంద్రం (నాల్కో), హిందుస్థాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ (హల్), కోట్స్, సెంట్రల్ యూనివర్సిటీ, ప్రభుత్వ షహీద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాల తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాత్రి ప్రసిద్ధ శబరి శ్రీ క్షేత్ర జగన్నాథ మందిరాన్ని దర్శించుకున్నారు.
పర్యటనలో ఎస్పీ రోహిత్ వర్మ, కొట్‌పాడ్ ఎమ్మెల్యే రుపుధర్ బోత్ర తదితరులు పాల్గొన్నారు. మంగళవారం సునాబెడా, సిమిలి గుడ, పొట్టంగి సమితుల్లో పర్యటించనున్నారు. ఏకలవ్య మోడల్ స్కూల్, ప్రసిద్ధ పర్యాటక కేంద్రం దేవమాలిని సందర్శిస్తారు. 10న మల్కన్‌గిరి జిల్లా, 11న తిరిగి కొరాపుట్ జిల్లాలో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం జరగనుంది.

ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది: గవర్నర్

ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది: గవర్నర్

ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది: గవర్నర్

ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది: గవర్నర్