
జయపురంలో ఆపరేషన్ ప్రహార్
జయపురం: గుట్కా, గంజాయి, టొబాకో తదితర మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు జిల్లా పోలీసు అధికారులు చేపట్టిన ఆపరేషన్ ప్రహార్ జయపురంలో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాలు, ధర్మ సంస్థల పరిసరాల్లో గుట్కా, టొబాకో తదితర వస్తువులు విక్రయించే దుకాణాలపై సోమవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. భవిష్యత్‌లో గుట్కా, పొగాకుతో తయారు చేసే వస్తువులు అమ్మితే వ్యాపారులపై ఆపరేషన్ ప్రహార్ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంధ్ర రౌత్ తెలిపారు.

జయపురంలో ఆపరేషన్ ప్రహార్