
గుణుపూర్‌లో చోరీ
● రూ. ఒక లక్ష నగదు, మూడు తులాల బంగారం అపహరణ
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ బృందావతి కాలనీలో నివసిస్తున్న ఆకాష్ కుమార్ పొరొచ్ఛా ఇంట్లో చోరీ జరిగింది. ఆకాష్ కుమార్ ఆరు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లారు. దీన్ని గమనించిన దుండగులు ఇంటి బయట తాళాలను విరగ్గొట్టిన దుండగులు లోనికి చొరబడి అలమరలో ఉంచిన ఒకలక్ష రూపాయల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలతోపాటు కొంత వెండి ఆభరణాలను దొంగిలించారు. దీనిపై బాధితుడు గుణుపూర్ ఆదర్శ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంఘటన స్థలానికి క్లూస్ బృందంతో చేరుకుని దొంగల ఆచూకీ కోసం సమీపంలోని సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

గుణుపూర్‌లో చోరీ