
గజపతి జిల్లాలో 17న మెగా ప్లాంటేషన్
మోహన అటవీ రేంజ్‌లో మొక్కల పంపిణీ వాహనాన్ని ప్రారంభిస్తున్న ఒడిషా ప్రధాన అటవీ సంరక్షణ అధికారి సురేష్‌పంత్
మోహానాలో పాణిగండా అటవీ సెక్షన్‌లో సీడ్ బాల్స్ త్రో కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాన అటవీ సంరక్షులు సురేష్ పంత్
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో రెండు నియోజకవర్గాలు, ఏడు సమితి కేంద్రాలు, 149 గ్రామపంచాయతీల్లో ఈ నెల 17న మెగా ప్లాంటేషన్ కార్యక్రమం జరుగుతుందని జిల్లా అటవీ శాఖ అధికారి కె.నాగరాజు తెలిపారు. ఇందుకోసం ఒడిశా ప్రధాన వనసంరక్షణ అధికారి, ముఖ్య అటవీ వాహినీ అధికారి సురేష్ పంత్ గజపతి జిల్లాలో రెండు రోజులు పర్యటించారు. ఆయన మోహన, చంద్రగిరి, మహేంద్రగిరి, రాయఘడ అటవీ రేంజ్ డివిజన్లలో పర్యటించి పలు నర్సరీ మొక్కల క్షేత్రాలు, సీడ్ బాల్స్ పంపిణీను సందర్శించారు. ఆయన వెంట పర్లాకిమిడి ఏ.సి.ఎఫ్. షైనీశ్రీదాస్, వివిధ గ్రామపంచాయితీల ప్రతినిధులు ఉన్నారు.

గజపతి జిల్లాలో 17న మెగా ప్లాంటేషన్

గజపతి జిల్లాలో 17న మెగా ప్లాంటేషన్

గజపతి జిల్లాలో 17న మెగా ప్లాంటేషన్