
తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాలి
రాయగడ: తెలుగ భాషవోని తీయదనం, తెలుగు భాష గొప్పతనం వంటివి ప్రతీ ఇంట్లోని పిల్లలకు నేర్పి భాషాభివృద్ధికి కృషి చేయాలని వక్తలు అన్నారు. ఆదివారం స్థానిక రాజ్ భవన్‌లో రాయగడ రచయితల సంఘం (రా రా సం ) నిర్వహించిన సాహితీ సదస్సు అలరించింది. అధ్యక్షుడు టి.వి.ఎన్.ఆర్.అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు, కవి, రచయిత భళ్లమూడి నాగరాజు మాట్లాడుతూ.. ఒకప్పుడు రాయగడలో పంతులు శ్రీరామ శాస్త్రి వంటి రచయితలు ఉండేవారని తెలిపారు. క్రమేపీ రచయితల సంఖ్య తగ్గుతోందరి ఆవేదన వ్యక్తం చేశారు. స్వీయ కవిత వినిపించారు. విశ్రాంత ప్రధనానోపాధ్యాయుడు డాక్టర్ బాబూరావు మహాంతి తెలుగు పదాలను సరిగ్గా ఉచ్చరించాలని అన్నారు. భళ్లమూడి వెంకట నాగేశ్వరరావు గ్రహాలు–జ్యోతిష్య శాస్త్రం వంటి విషయాలపై ప్రసంగించి చంద్రగ్రహణం గురించి వివరించారు. పి.ఎం.శంకరరావు శతక పద్యాలు ఆలపించారు. సాహితీ కార్యదర్శి మామిడి గణపతిరావు , విశ్రాంత అధ్యాపకులు ఎల్.శివకేశవరావు , సీహెచ్ చక్రధర్, వై రవికుమార్, పి రామమెహన్ రావు తదితరులు పాటలు పాడి వినిపించారు.