
38 కిలోల గంజాయి స్వాధీనం
● ముగ్గురు అరెస్టు
రాయగడ: జిల్లాలోని బిసంకటక్, రాయగడ రైల్వే స్టేషన్లలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అబ్కారీ శాఖ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 38.500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాయగడ అబ్కారీ శాఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని పట్టుకుని వారిని విచారించగా వారి నుంచి 20.500 కిలోల గంజాయి పట్టు బడింది. ఈ మేరకు అబ్కారీ శాఖ అధికారులు వారిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కర్ణాటకకు చెందిన అజాజ్ పటక్కా, ఎ.నూరుల్లాలు ఉన్నారు. అలాగే జిల్లాలోని బిసంకటక్ పరిధిలోని హటో మునిగుడ రైల్వే స్టేషన్‌లో 18 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న అధికారులు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కె.కార్తిక్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

38 కిలోల గంజాయి స్వాధీనం