
22 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు
పర్లాకిమిడి: గజపతి జిల్లాస్థాయి గురుదివాస్ ఉత్సవాలు, ముఖ్యమంత్రి శిక్షపురస్కారాలు సత్కార సమావేశం స్థానిక మహేంద్రగిరి పురపాలక ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగాయి. ఈ ఉత్సవాలకు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, మోహానా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, పురపాలక సంఘం అధ్యక్షురాలు నిర్మలా శెఠి, జిల్లా పరిషత్తు సీడీవో శంకర కెరకెటా, జిలా పరిషత్ చైర్మన్ గవర తిరుపతి రావులు అతిథులుగా విచ్చేయగా.. జిల్లా ముఖ్య విద్యాధికారి డాక్టర్ మాయా ధర్ సాహు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శిక్షా పురస్కారాలు జిల్లాలో 22 మంది ఉపాధ్యాయులకు ముఖ్య అతిథులు పర్లాకిమిడి, మోహానా ఎమ్మెల్యేల చేతులమీదుగా అందజేశారు. అందులో ఏడుగురు ప్రాథమిక, 14 మంది మాధ్యమిక ఉపాధ్యాయులు, ఒక సీఆర్‌సీసీ పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ కోఆర్డినేటరు ఎ.రవికుమార్, ఆదనపు జిల్లా శిక్షాధికారి ఎన్.గిరిధరి, డైట్ (గజపతి) ప్రిన్సిపాల్ ప్రదీప జెన్నా పాల్గొన్నారు.

22 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు

22 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు