
మహేంద్రగిరి సందర్శన
పర్లాకిమిడి: గజపతి జిల్లా పర్లాకిమిడి అటవీ డివిజన్‌కు ఒడిశా ప్రధాన ముఖ్యవన సంరక్షులు సురేష్‌పంత్ మహేంద్రగిరి, రామగిరి, మహేంద్రగడ గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. ఆయన పర్యటనలో పలు నర్సరీలు సందర్శించి వాటిని సంరక్షించే తీరును ప్రసంసించారు. అనంతరం మహేంద్రగిరి పర్వతాన్ని సందర్శించి రుద్రాక్ష మొక్కలు నాటారు. ఆయన వెంట జిల్లా అటవీశాఖ అధికారి కె.నాగరాజు, ప్రాంతీయ వనసంరక్షులు (బరంపురం) విశ్వనాథ్ నీలాంబరో, ప్రభుత్వ అసిస్టెంటు వనసంరక్షులు అరుణ్‌కుమార్ సాహు, ఏ.సి.ఎఫ్. షైనీశ్రీ దాస్ ఉన్నారు.

మహేంద్రగిరి సందర్శన