
ఉత్సాహంగా వినాయక ఉత్సవాలు
రాయగడ: పట్టణంలో వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా స్థానిక న్యూకాలనీలో వినాయక చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో గురువారం లక్ష పుష్పార్చన పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక వేద పండితులు రేజేటి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో మహిళలు పాల్గొని పుష్పార్చన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పిండివంటలను గణనాథునికి నైవేద్యంగా సమర్పించారు.
కొత్తపేటలో..
వినాయక ఉత్సవాలను పురస్కరించుకుని కొత్తపేటలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి వేషధారణలు ఆకట్టుకున్నాయి. పులివేషాలు, శక్తిరూపిణి, కాళి వంటి వేషాలతో నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఉత్సాహంగా వినాయక ఉత్సవాలు

ఉత్సాహంగా వినాయక ఉత్సవాలు

ఉత్సాహంగా వినాయక ఉత్సవాలు