
పురుగు మందు తాగి వివాహిత ఆత్మహత్య
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి టిగల్ పంచాయతీ కటమెట్ల గ్రామానికి చెందిన రామే మాడ్కమి (50) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. కనిమెట్లలో నివాసం ఉంటున్న పెంట మాడ్కమి భార్య మంగళవారం రామే మాడ్కమి రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసింది. అందరూ నిద్రపోయిన తరువాత వ్యవసాయం కోసం తెచ్చిన పురుగు మందును తాగింది. నిద్ర మధ్యలో లేచిన భర్త చూసి కిందపడి ఉన్న భార్యను చూశాడు. వెంటనే కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందింది. ఎం.వి–79 పోలీస్ ఐఐసీ కృష్ణకాంత్ తండి ఆరోగ్య కేంద్రానికి చేరుకొని కేసు నమోదు చేశారు. భర్తను విచారించగా.. ఎందుకు ఇలా జరిగిందో తెలియదన్నాడు. ఆమె మృతిపై దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఐఐసీ తెలిపారు.