
బీసీల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లా, నియోజకవర్గాల, మండల కమిటీలు ఏర్పాటు చేసి గ్రామగ్రామాన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జెండా ఎగిరేలా కృషి చేయాలని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 130 బీసీ కులాల అవసరాలు, ఆకాంక్షలు నెరవేర్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. బీసీ విద్యార్థుల వసతి గృహాల సమస్యల నుంచి జాతీయస్థాయిలో జనగణన, కుల గణన చేసేవరకు అనేక సమరశీల పోరాటాలు చేసి విజయాలు సాధించగలిగామన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పైడి చందు బీసీ విద్యార్థుల సమస్యల పరిష్కారమే ధ్యేయమన్నారు. సమావేశంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘ ఉత్తరాంధ్ర అధ్యక్షుడు కొమ్ము రమణమూర్తి, జిల్లా నాయకులు రత్నాల మురళీమోహన్‌రావు, బగాది రమణమూర్తి, రాయల రాము, రాజమహంతి భానుచందర్, గానుగుల గణేష్ తదితరులు పాల్గొన్నారు.