
పిడుగుపాటుకు మహిళకు గాయాలు
రాయగడ: జిల్లాలోని పద్మపూర్ సమితి మాలతీపూర్ గ్రామ సమీపంలోని కెనాల్ వద్ద సోమవారం మహిళపై పిడుగు పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన సుమిత్ర గౌడొ కెనాల్ వద్ద ఆవులను పచ్చిక మేపేందుకు తీసుకువెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగి ఆవులను తొలుకుని వస్తుండగా ఉరుములతో కూడిన వర్షం కురవడంతో కెనాల్ వద్ద ఆగారు. అదే సమయంలో పిడుగు పడడంతో స్పృహతప్పి పడిపోవడంతో గాయపడ్డారు. అక్కడ ఉన్నవారు చూసి వెంటనే ఆంబులెన్స్‌ను రప్పించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.