
ఫైరింజిన్ ఢీకొని విద్యార్థి దుర్మరణం
భువనేశ్వర్: అగ్ని మాపక వాహనం (గంటల లారీ) ఢీకొని కళాశాల విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పూరీ చందనపూర్ ప్రాంతంలో ఈ దుర్ఘటన సోమవారం చోటు చేసుకుంది. కళాశాల నుంచి బైక్‌పై తిరిగి వస్తుండగా అగ్ని మాపక వాహనం ఢీకొంది. ఘటనా స్థలంలో విద్యార్థి మృతి చెందాడు. సహబికి చెందిన చందన్ పూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుడిని పూరీ ఎస్‌సీఎస్ కళాశాల విద్యార్థి శుభం సేనాపతిగా గుర్తించారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి విచారం వ్యక్తం చేశారు. మృత విద్యార్థి కుటుంబం పట్ల సానుభూతి ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు.
ఫార్మసీ ఆఫీసర్స్ సర్వీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
రాయగడ: ఒడిశా ఫఆర్మసీ ఆఫీసర్స్ సర్వీస్ అసోసియేషన్ రాయగడ శాఖ నూతన కార్యవ ర్గం ఎన్నికై ంది. స్థానిక సమావేశం హాల్‌లో సోమవారం ఎన్నిక ప్రక్రియ జరిగింది. అధ్యక్షులుగా శివప్రసాద్‌నాయక్, ఉపాధ్యక్షులుగా అశ్విని కుమార్ రవుత్, సాధారణ కార్యదర్శిగా సంతోష్ కుమార్ పాత్రో, సహకార్యదర్శులుగా ల్మణ్ బాగ్, ప్రమోద్ కుమార్ సాహు, కొశాధికారిగా జగన్నాథ్ నాయక్, రాయగడ సబ్ డివిజన్ ఆర్గనైజేషనల్ కార్యదర్శిగా హరినాథ్ భంగి, గుణుపూర్ సబ్‌డివిజన్ ఆర్గనైజేషనల్ కార్యదర్శిగా సూర్యనారాయణ పండ నియమితులయ్యారు. రెండేళ్ల పాటు కొత్త కార్యవర్గం కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
బాధిత బాలికని
పరామర్శించిన బీజేడీ ఎంపీలు
భువనేశ్వర్: న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న పూరీ జిల్లా నిమ్మాపడా ప్రాంతం బొలంగా గ్రామానికి చెందిన బాలికని బిజూ జనతాదళ్ పార్లమెంటు సభ్యులు సోమవారం కలిశారు. వారిలో మానస్ మంగరాజ్, డాక్టరు సస్మిత్ పాత్రో, సులతాదేవ్, నిరంజన్ ఉన్నారు. ఈ సందర్భంగా చికిత్స కల్పిస్తున్న వైద్య నిపుణుల బృందంతో చర్చించి బాలిక ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. బాధిత బాలి క బంధువులతో కలిసి ఆత్మస్థైర్యంతో ఉండాల ని ప్రోత్సహించారు. సహాయ సహకారాలు అ ందుబాటులో ఉంటాయని అభయం ఇచ్చారు.
రక్షణ కమిటీ ఏర్పాటు
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా మహా విద్యాలయంలో లైంగిక వేధింపుల నుంచి రక్షణ పొందేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. సోమవారం సీనియర్ అధ్యాపకురాలు డాక్టర్ సంజుక్త పండా నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. ఇందులో పది మంది సభ్యులు ఉంటారు. వారి పేర్లు, ఫోన్ నంబర్లతో కూడిన బ్యానర్‌ను కళాశాలలో ఏ ర్పాటు చేశారు. విద్యార్థినులకు ఎవరైనా లైంగిక వేధింపులకు గురిచేస్తే తమను సంప్రదించాలని సంజుక్త ప్రకటించారు. అంతేకాక ప్రభు త్వం తరఫున 181 టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా వినియెగించుకోవచ్చన్నారు. విద్యార్థినుల భద్రతతకే కమిటీ ప్రాధాన్యం ఇస్తుందని ప్రకటించారు.
ఘనంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం వార్షికోత్సం
కొరాపుట్: ఒడిశా రెవెన్యూ సర్వీసు ఉద్యోగుల సంఘం 82వ వార్షికోత్సం ఘనంగా జరిగింది. సోమవారం జయపూర్ సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి కొరాపుట్ జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ గిరిజన సంప్రదాయాలతో జయనగర సంగం కల్యాణ మండపం వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ జరిగిన సమావేశంలో కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ నాయకుడు బిహారి మహాపాత్రో మాట్లాడుతూ ఈ సమస్యల పరిష్కారానికి ఉద్యమ బాట తప్పదన్నారు. రాష్ట్ర కార్యదర్శి చిత్తరంజన్ మాట్లాడుతూ ఉద్యోగులు ఐక్యంగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకుడు నారాయణ దాస్, జ్ఞాన్ రంజన్ దాస్, దేవేంద్ర పాత్రో, సంజయ్ కుమార్ పండా, శశి భూషణ్ దాస్ ప్రసంగించారు.

ఫైరింజిన్ ఢీకొని విద్యార్థి దుర్మరణం

ఫైరింజిన్ ఢీకొని విద్యార్థి దుర్మరణం

ఫైరింజిన్ ఢీకొని విద్యార్థి దుర్మరణం