
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
కొరాపుట్: ఈ నెల తొమ్మిదో తేదీన జరిగే సార్వత్రి సమ్మెను జయప్రదం చేయాలని వామపక్షా కార్మిక సంఘాల ఐక్య వేదిక విజ్ఞప్తి చేసింది. ఆదివారం సాయంత్రం జయపూర్ పట్టణంలోని జాతీయ రహదారి 26పై ఉన్న ఉమెన్స్ కాలేజీ సమీపంలోని శ్రామిక్ భవన్‌లో సమావేశం జరిగింది. ఇందులో సీపీఐ నాయకుడు ప్రమోద్ మహాంతి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టనున్న బంద్‌ను జయప్రదం చేయాలన్నారు. రాష్ట్రంలో పని చేస్తున్న ఆశ, అంగన్‌వాడీ, వంట సహాయకులకు ఉద్యోగ హోదా కల్పించాలని, పాత పింఛన్ విధానం అమలు చేయాలని డిమాండ్లు చేశారు. వివిధ సంఘాలలో పని చేస్తున్న కార్మికులతో పాటు అసంఘటిత కార్మికులు కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, ఐఎన్‌టీయూసీ, ఈపీఎఫ్ పెన్సనర్ల ఆసోసియేషన్‌కు తదితర కార్మిక సంఘాలకు చెందిన జుదిష్ట రౌవులో, సుభాష్ బట్టాచార్య, ఉత్తం నాయక్, కె.భగవాన్‌రెడ్డి పాల్గొన్‌ానరు.