హోరెత్తుతున్న నిరసనలు | - | Sakshi
Sakshi News home page

హోరెత్తుతున్న నిరసనలు

Jul 2 2025 5:10 AM | Updated on Jul 2 2025 5:10 AM

హోరెత

హోరెత్తుతున్న నిరసనలు

భువనేశ్వర్‌: స్థానిక నగర పాలక సంస్థ బీఎంసీ అదనపు కమిషనర్‌పై అమానుష దాడి పట్ల సిబ్బంది తీవ్ర నిరసనం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యని వ్యతిరేకిస్తూ మంగళ వారం బీఎంసీ కార్యాలయలంలో అధికారులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొన్నారు. బీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెకి నడుం బిగించారు.

బొలంగీర్‌లో ఓఏఎస్‌ రాతకోతలు విరమణ

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఓఏఎస్‌ అధికారిపై దాడికి నిరసనగా బొలంగీర్‌ జిల్లాలో ఓఏఎస్‌ అధికారులు రాతకోత కార్యకలాపాలు విరమించి శాంతియుతంగా నిరసన ప్రదర్శిస్తున్నారు. బొలంగీర్‌ సర్క్యుట్‌ హౌస్‌లో ఈ అధికారులు అంతా సమావేశమై తదుపరి కార్యాచరణ కోసం వ్యూహాత్మక కార్యాచరణ రూపొందిస్తున్నారు. కటక్‌ నగరంలో పరిస్థితి మరింత వాడివేడిగా కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో ఓఏఎస్‌, ఓఆర్‌ఎస్‌ అధికారులు సామూహిక సెలవు ఆందోళనకు దిగారు. నిందితుల్ని కఠినంగా శిక్షించేంత వరకు సెలవులో ఉంటామని హెచ్చరించారు. కటక్‌ అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ శివ్‌ టొప్పో ఈ మేరకు సమాచారం ఇచ్చారు.

హోరెత్తుతున్న నిరసనలు1
1/1

హోరెత్తుతున్న నిరసనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement