
వినతుల వెల్లువ
పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితి బోమ్మిగ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాయింట్ గ్రీవెన్స్ సెల్ సోమవారం జరిగింది. ఈ గ్రీవెన్స్‌కు జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్, జిల్లా ఎస్పీ జ్యోతింద్రనాథ్ పండా, జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వాహణ అధికారి శంకర కెరకెటా, గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, సబ్ కలెక్టర్ అనుప్ పండా హాజరయ్యారు. బొమ్మిక పంచాయతీలో మధుసూదన్‌పూ ర్, కంట్రగడ, మచ్చుమర గ్రామాల నుంచి మొత్తంగా 54 వినతులు అందాయి. వాటిలో వ్యక్తిగతం 15, గ్రామ సమస్యలకు సంబంధించినవి 39 అందాయి. వాటిని త్వరితగతంగా పరిష్కరించాలని జి ల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. తహసీల్దార్ నారాయణ బెహరా, గుసాని బీడీఓ గౌరచంద్ర పట్నాయక్, సీడీఎంఓ డాక్టర్ ఎం.ఎం.అలీ, డి. ఎస్.ఎస్.ఓ సంతోష్‌కుమార్ నాయక్ పాల్గొన్నారు.
చిత్రకొండ సమితిలో..
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ నేతృత్వంలో గ్రీవెన్స్ నిర్వహించి 48 వినతులు స్వీకరించారు. చిత్రకొండ పరిసర పంచాయతీలకు చెందిన వారు వచ్చి తమ సమస్యలను వినతుల రూపంలో కలెక్టర్‌కు అందజేశారు. కలెక్టర్ వాటిని పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని హా మీ ఇచ్చారు. సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి, జిల్లా అభివృద్ధిశాఖ అధికారి నరేశ్ చంద్ర సభోరో, చిత్రకొండ సమితి ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.

వినతుల వెల్లువ