
వైద్య శిబిరానికి విశేష స్పందన
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వభీమాన్ ఏరియా జాంత్రీ పంచాయతీలో సోమ వారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా ఆస్పత్రి మెడిషన్ స్పెషలిస్ట్ కృష్ణచంద్ర మహపాత్రో నేతృత్వంలో 15 మంది వైద్యశాఖ సిబ్బంది 200 మందికి వైద్య సేవలు అందించారు. 15 మందికి మలేరియా పాజిటీవ్ వచ్చింది. మరికొంత మందికి సాధారణ జ్వరం, వృద్ధులుకు ఈసీజీ తీసి మందు లు అందించారు. బీపీ ఉన్నవారికి మందులు ఇచ్చా రు. కంటి సమస్యలు ఉన్న వారికి పరీక్షలు చేశారు.
ఇదే తొలిసారి..
చిత్రకొండ సమితిలో దూర్గాం ప్రాంతం ఒకప్పుడు మావోలు అడ్డాగా ఉండేది. జాంత్రీ పంచాయతీకి మావోల భయంతో అప్పటి ప్రభుత్వం రహదారి కూడా నిర్మించలేదు. ఈ పంచాయతీకి వెళ్లాలంటే లాంచీలే శరణ్యం. 4 గంటల పాటు చిత్రకొండ ఫిల్ బాయి నుంచి లాంచీలో ప్రయాణం చేసి ఆ ప్రాంతంలో మలేరియా టెస్టులు చేసి ఉచితంగా మందు లు పంపిణీ చేశారు. జాంత్రీ పంచాయతీలో వైద్య శిబిరం ఏర్పాటుచేసి మందులు ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ ప్రాంతంలో ఏవరికై నా జబ్బు చేస్తే జాన్‌బాయి వెళ్లి అక్కడ ఆరోగ్య కేంద్రంలో ఇచ్చిన మందులు తప్ప.. గిరిజన ప్రజలకు బయట ప్రపంచం తెలియదు. మావద్దకు వచ్చి వైద్యులు మందులు ఇస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. మల్కన్ గిరి ప్రభుత్వ ఆస్పత్రి సీనియర్ వైద్యులు నారాయణ్ పాత్రో, దేవశిష్ పండా, ఐసీయూ సిబ్బంది పద్మావతి జేనా, నర్సింగ్ అధికారి రష్మరేఖా పరిడా, సంగీత నాయక్, దీపికా దాస్, ఐశ్వర్య స్యాయ్, ఆరోగ్య కార్యకర్తలు శంకర్ పాల్, మహిమా దాస్, బసంత్ రాయ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

వైద్య శిబిరానికి విశేష స్పందన