
వాటర్‌షెడ్ జాయింట్ డైరెక్టర్‌పై విజిలెన్స్ దాడి
కొరాపుట్: వాటర్ షెడ్ జాయింట్ డైరెక్టర్ దయానిధి బాగ్ ఆస్తుల లక్ష్యంగా విజిలెన్స్ విభాగం దాడులు నిర్వహించింది. సోమవారం ఉదయం 6 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా 8 చోట్ల ఏక కాలంగా ఈ దాడులు ప్రారంభమయ్యాయి. వాటర్ షెడ్ విభాగంలో రాయగడ జిల్లాలో, రాష్ట్ర సోషల్ కన్జర్వేషన్ విభాగంలో జాయింట్ డైరెక్టర్‌గా పని చేశారు. విధి నిర్వహణలో అనేక అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. కలహండి జిల్లా భవాని పట్న విజిలెన్స్ కోర్టు ప్రత్యేక జడ్జి ఈ దాడులకు సెర్చ్ వారెంట్లు జారీ చేశారు. నిందితుని స్వస్థలం కలహండి జిల్లా జునాగడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుప్పుగాంలో, ఇదే జిల్లా ధర్మగఢ్ లో విక్రం గుడలోని అల్లుడు నివాసంలో, భువనేశ్వర్‌లోని గోతపట్న లోని మహానది అపార్ట్‌మెంట్‌లో, భువనేశ్వర్‌లోని చంద్ర శేఖర్ పూర్‌లోని సొంత ఇంటిలో, భువనేశ్వర్‌లోని వాటర్‌షెడ్ కార్యాలయ చాంబర్‌లో, నబరంగ్‌పూర్ జిల్లా మజ్జిగుడలో నిర్మితం అవుతున్న భవనంలో, నబరంగ్‌పూర్ జిల్లా చుటియా గుడలో భార్య పేరు మీద ఉన్న 2 భవనాల్లో దాడులు ప్రారంభమయ్యాయి. ఈ దాడుల్లో 10 మంది డీఎస్పీలు, 8 మంది ఇన్‌స్పెక్టర్లు, 10 మంది ఏఎస్‌ఐలు పాల్గొన్నారు.

వాటర్‌షెడ్ జాయింట్ డైరెక్టర్‌పై విజిలెన్స్ దాడి

వాటర్‌షెడ్ జాయింట్ డైరెక్టర్‌పై విజిలెన్స్ దాడి