
రైలు ప్రయాణం చార్జీలు పెంపు
భువనేశ్వర్: భారతీయ రైల్వే శాఖ ప్రయాణం చార్జీలు పెంచింది. జూలై ఒకటో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా కొత్త చార్జీలు అమలవుతాయని స్పష్టం చేసింది. ద్రవ్య సేవా పన్ను (జీఎస్‌టీ), రిజర్వేషన్, సూపర్‌ఫాస్ట్ సర్‌చార్జీలు వంటి అనుబంధ చార్జీల్లో మార్పు లేదని రైల్వే శాఖ తెలిపింది. చార్జీల తాజా పెంపు ఉత్తర్వుల ప్రకారం సబర్బన్ సింగిల్ జర్నీ చార్జీలు, సీజన్ టిక్కెట్ల (సబర్బన్, నాన్–సబర్బన్ మార్గాలకు) చార్జీల్లో మార్పు లేదు. సాధారణ తరగతిలో 500 కిలో మీటర్ల వరకు ప్రయాణ చార్జీలో ఎలాంటి మార్పు లేకుండా యథాతథంగా కొనసాగుతుంది. 501 నుంచి 1500 కిలో మీటర్ల వరకు ప్రయాణానికి రూ. 5, 2,500 కిలో మీటర్ల వరకు రూ. 10, 2,501 నుండి 3,000 కిలోమీటర్ల ప్రయా ణం చార్జీని రూ.15 పెంచారు.
హర్యానారాష్ట్ర మహిళపై లైంగిక దాడి
జయపురం: పొట్టకూటి కోసం.. కష్టపడి జీవించేందుకు హర్యాన రాష్ట్రం నుంచి జయపురం వచ్చిన ఒక మహిళపై దుండగుడు లైంగిక దాడికి పాల్ప డ్డాడు. బాధిత మహిళ జయపురం మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి పట్టణంలో ఒక వ్యాపారి అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మహిళా పోలీసు అధికారి అంకిత ఖాల్కో వెల్లడించారు. పోలీసుల వివరణ ప్రకారం.. ఈ ఘటన జూన్ 28వ తేదీ రాత్రి జరిగింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కాశ్యప్ పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు.
కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన..
● 16 గ్రామాలకు రాకపోకలు బంద్
కొరాపుట్: భారీ వర్షాలకు తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో 16 గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. కొరాపుట్ జిల్లా నందపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో లమ్తాపుట్ సమితి ఉమ్వెల్ గ్రామ పంచాయతీకి సిమిలిగుడ సమితి రాజుపట్ గ్రామ పంచాయతీలను కలిపే వంతెన సోమవారం కొట్టుకుపోయింది. ఈ రెండు పంచాయతీలలో చెరో ఎని మిదేసి గ్రామాలు కలసి కొలాబ్ రిజర్వాయర్‌లో వెదురు వంతెన నిర్మించుకొని రాక పొకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ వంతెన కూలిపోవడంతో సిమిలిగుడ సమితి కేంద్రానికి వెళ్లాలంటే సుమారు 60 కిలో మీటర్లు ప్రయాణం చేయాలి. ఇక్కడ వంతెన కోసం దశాబ్దాలుగా ప్రజలు విజ్ఞప్తులు చేస్తున్నా వంతెన నిర్మాణం జరగలేదు. దీంతో గిరిజనులే వెదు రు వంతెన నిర్మించుకుంటే అదీ కూలిపోయింది.