
ప్రమాదకరంగా సువర్ణరేఖ ప్రవాహం
● పాఠశాలలకు సెలవు
భువనేశ్వర్: సువర్ణ రేఖ వరదతో ఉప్పొంగుతుంది. రాజ్‌ఘాట్ వద్ద ప్రమాద సంకేతం దాటి నది నీటి మట్టం పెరిగింది. మంగళ వారం ఉదయం 7 గంటలు సరికి 10.83 మీటర్ల నీటి మట్టంతో సువర్ణ రేఖ పొంగి పొర్లుతోంది. భొగొరాయి మండలంలో 15 పంచాయతీలలోని 30 గ్రామాలు నీట మునిగిపోయాయి.
శాంతిస్తున్న జలకా నది
ప్రమాద సంకేతం దిగువన జలకా నది నీరు ప్రవహిస్తోంది. బొస్తా మండలం మథాని తీరంలో ప్రమాద సంకేతం దిగువ నీటి మట్టంతో ప్రవహిస్తోంది. బొస్తా మండలంలో 10 గ్రామాలు వరద నీట మునిగాయి.
పాఠశాలలకు సెలవు
బాలాసోర్, మయూర్‌భంజ్ జిల్లాల్లో వరద ముప్పు పొంచి ఉంది. ఈ జిల్లాల్లో మూడు ప్రధాన నదులు సువర్ణ రేఖ, బుఢాబలంగ్, జలకాలో వరద నీరు ఉప్పొంగుతోంది. బుఢాబలంగ్ నదిలో వరద ఉద్ధృతంగా ఉంది. ప్రస్తుతం ఈ నది నీటి మట్టం 7.20 మీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. వరద ముప్పు దృష్ట్యా రెండు జిల్లాల జిల్లా కలెక్టర్లకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సురక్షిత తరలింపుతో పాటు సహాయక చర్యలను పర్యవేక్షించాలని జల వనరుల శాఖ ఆదేశించింది. మయూర్‌భంజ్ జిల్లాలో మెరుపులు, ఉరుములతో భారీ నుంచి అతి భారీగా వర్షాలు కొనసాగుతున్నాయి. దీని ప్రభావం పెరుగుతుందని వాతావరణ శాఖ తెలియజేసింది. దీని దృష్ట్యా మయూర్‌భంజ్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు 3 రోజుల పాటు మూసివేయాలని జిల్లా కలెక్టర్ హేమకాంత్ సాయి ఆదేశించారు.

ప్రమాదకరంగా సువర్ణరేఖ ప్రవాహం

ప్రమాదకరంగా సువర్ణరేఖ ప్రవాహం

ప్రమాదకరంగా సువర్ణరేఖ ప్రవాహం