
కెనాల్‌లో లాంచీ బోల్తా
కొరాపుట్: కొరాపుట్ జిల్లా దశమంత్‌పూర్ సమితి ద్వరసని గ్రామ పంచాయతీలోని ముండి గుడ కెనాల్ లో బుధవారం సాయంత్రం లాంచీ బోల్తాపడింది. అయితే అందులో ఉన్నవారిని సమీపంలో ఉన్న గిరిజనులు కాపడడంతో పెను ప్రమాదం తప్పింది. లాంచీ బోల్తాపడిన సమయంలో అందులో ఏడుగురు ఉన్నారు. లాంచీ బోల్తాపడడంతో అందులో ఉన్నవారు భయంతో హాహాకారాలు చేయడంతో వారి కేకలువిని సమీపంలో ఉన్న గిరిజనులు రంగం లోనికి దిగారు. తాళ్లు వేసి వారిని రక్షించారు. లాంచీని కూడా అతికష్టం మీద ఒడ్డుకు చేర్చారు. అయితే లాంచీలో ఉన్న మూడు బైక్‌లు వరద నీటిలో కొట్టుకు పోయాయి. మురాన్ నది నుంచి ఈ కెనాల్ ద్వారా నీరు ఇంద్రావతి డ్యాంలో కలుస్తుంది. కెనాల్‌కి మరో వైపు నబరంగ్‌పూర్ జిల్లా తెంతులకుంటి సమితి ఉంది.
ప్రయాణికులను కాపాడిన గిరిజనులు
వరదనీటిలో కొట్టుకుపోయిన
మూడు బైక్‌లు

కెనాల్‌లో లాంచీ బోల్తా