
క్రీడా రత్నాలు
భువనేశ్వర్: ప్రపంచ క్రీడా వేదికపై ఒడిశా పోలీసు క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. అమెరికా బర్మింగ్‌హామ్‌లో జరిగిన ప్రపంచ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ 2025లో కరాటే, 800 మీటర్లు, 1500 మీటర్లు పందెంలో బంగారు పతకాలు సాధించారు. మరిన్ని తేజోవంతమైన విజయాలతో వీరి భవిష్యత్ ఉజ్వలం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అభినందించారు. కరాటే (64 కిలోల లోపు) విభాగంలో కానిస్టేబుల్ భగవాన్ రెడ్డి, పురుషుల (84 కిలోల లోపు) కరాటే పోటీలో కానిస్టేబుల్ సుమన్ శేఖర్ దాస్ బంగారు పతకాలు సాధించారు. మహిళల 1500 మీటర్ల రేసులో కానిస్టేబుల్ సుష్మితా టిగ్గా బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆమె గతంలో 800 మీటర్ల రేసులో రజత పతకాన్ని గెలుచుకుంది. పురుషుల 1500 మీటర్లు మరియు 800 మీటర్ల రేసులో కానిస్టేబుల్ అశోక్ దండసేన వరుగా 2 బంగారు పతకాలు చేజిక్కించుకున్నాడు.