
జనావాసాల్లో చిరుత సంచారం
కొరాపుట్: జనావాసాల్లో చిరుత పులి సంచా రం ఆందోళన రేకెత్తించింది. శుక్రవారం వేకువజామున నబరంగ్‌పూర్ జిల్లా సరిహద్దు చత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్‌లోని ఇమిలి పరాలో హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద చిరుత కనిపించింది. కాలనీ వద్ద ప్రహరీపై చిరుత కదలికలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.
నేటి నుంచి కేంద్ర మంత్రి పర్యటన
కొరాపుట్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శని, ఆదివారాల్లో కొరాపుట్ జిల్లాలో పర్యటిస్తారని రాష్ట్ర ప్రాథమిక విద్య, సాంఘీక సంక్షేమశాఖ మంత్రి నిత్యానంద గోండో ప్రకటించారు. శుక్రవారం జయపూర్ పట్టణంలో జగత్ జనని జంక్షన్ వద్ద బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించా రు. శనివారం ఉదయం కొరాపుట్ జిల్లా ధమంజోడిలోని భారత అల్యూమినియం కేంద్రం (నాల్కో) వద్దకు కేంద్రమంత్రి చేరుకుంటారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలో జగన్నాథ శ బరి శ్రీక్షేత్రంలో జరగనున్న మారు రధాయాత్ర బహుడాలో పాల్గొంటారు. అనంతరం కేంద్రి య విశ్వ విద్యాలయంలో రూ .480 కోట్లతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేస్తా రు. ఆదివారం జయపూర్ పట్టణంలోని జగన్నాధ సాగర్ సమీపంలో పంచానన్ మందిర్ సమీపంలో కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి కేంద్రమంత్రి శంకుస్ధాపన చేస్తారు. కేంద్ర ప్రభుత్వ అకాంక్ష జిల్లాలో ఉన్న కొరాపుట్ లో కేంద్ర ప్రభుత్వ పథకాలను సమీక్ష చేస్తారు. ఈ పథకాలు త్వరగతిన ప్రజలకు చేరేందుకు దిశ నిర్దేశం చేస్తారు. సమావేశానికి అవిభక్త కొరాపు ట్ జిల్లాల నుంచి ప్రజలు తరలి వస్తారని మంత్రి నిత్యానంద గోండో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉన్న కొరాపుట్ జిల్లాలో బీజేపీని పటిష్టత చేస్తారని మంత్రి పేర్కొనా రు. సమావేశంలో కొరాపుట్ ఎమ్మెల్యే రఘు రాం మచ్చో, బీజేపీ నాయకుడు గౌతం శాంత్ర ఉన్నారు.
రైతులను కోలుకోలేని
దెబ్బ తీసిన వర్షాలు
జయపురం: కొద్దిరోజులుగా జయపురం సబ్‌డివిజన్‌లో విరామం లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బ తీశాయి. పలు ప్రాంతాలలో రబీ ధాన్యం పంట కోతలు జరిగిన తరువాత కొంత పంట నూర్పులు జరిగినా మరికొంత పంట కోతలు జరగి పొలాలోనే ఉన్నాయి. ఆ సమయంలో వర్షాలు పడటం వలన ధాన్యం మొక్కలు మొలిచాయని జయపురం సబ్‌డివిజన్ కుంధ్ర సమితి రాణీగుడ పంచాయతీ సర్గిగుడ గ్రామ రైతులు వెల్లడించారు. ధాన్యం కోతలు జరిగి నూర్పులు ప్రారంభించే సమయంలో వర్షాలు పడటంవలన ధాన్యం మొలకలొచ్చాయని, వర్షం నుంచి ధాన్యం మరో సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు విరామం లేకుండా పడిన వర్షాలు వలన అవరోధం ఏర్పడిందని రైతులు వాపోయారు. ఆ గ్రామంలో మనోజ్ కుమార్ మహంకుర తన 5 ఎకరాలలో వరి పండించగా వచ్చిన 130 క్వింటాళ్ల ధాన్యం వర్షాలు కారణంగా మొలకలెత్తయని వారు వెల్లడించారు.
విద్యార్థులకు చదువు కష్టాలు!
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహానా బ్లాక్‌లో స్కూల్‌కు వెళ్లడానికి విద్యార్థులు పడరాని కష్టాలు ఎదుర్కుంటున్నారు. మోహానా బ్లాక్ గరడమా పంచాయతీ రాజఖమా గ్రామస్తులు వర్షాకాలంలో కిలోమీటరున్నర నడిచి గడపుర్ నదిని దాటి బడసాయి స్కూలుకు వెళ్లాల్సి ఉంటుంది. స్వాతంత్య్రం సాధించి 76 ఏళ్లు గడిచినా గడపూర్ నదిపై వంతెనను ప్రజాప్రభుత్వాలు నిర్మించలేకపోవడంతో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. మోహానా బ్లాక్ ఖుంబర్పాడ, రాంసింగ్, గురిమెరా, బెత్తగుండ, బెముడిపద, చిందన్‌కపంక, లుటిపదర్, గురుఝలి, బలిబంద, గంగుడిపంకల్ మరియు రాజఖమా గ్రామాలకు వంతెన లేకపోవడంతో వర్షాకాలంలో బాహ్యాప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి.

జనావాసాల్లో చిరుత సంచారం

జనావాసాల్లో చిరుత సంచారం

జనావాసాల్లో చిరుత సంచారం