
సత్యసాయి భక్తుల సేవలు నిరుపమానం
కొరాపుట్: భగవాన్ సత్యసాయి భక్తుల సేవలు నిరుపమానమని కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత పేర్కొన్నారు. కొరాపుట్ జిల్లా దశమంత్‌పూర్ సమితి కేంద్రంలో నూతనంగా నిర్మించిన భగవాన్ సత్యసాయి సమితి కేంద్ర భవనం శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యసాయి భౌతికంగా మన మధ్య లేకపోయినా అతని ఆశయాలు సజీవంగా కొనసాగుతున్నాయన్నారు. వెనుకబడిన కొరాపుట్ జిల్లాలో సాయి భక్తులు నిత్యం ఏదో ఒక సమాజ సేవ చేయడం తాను బాల్యం నుంచే గమనించానని పేర్కొన్నారు. తన వంతుగా సాయి సమితికి ఎటువంటి సాయం కావాలన్నా అందిస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో సాయి సమితి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎస్‌కే దాస్, సచిదానంద, డాక్టర్ బెహర, ఆరుణ్ పాత్రో (రాజా), ఎస్.నాగభూషణ్‌రావు, మర్కెండయ్ షరాఫ్, నవీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.