
రథయాత్రలో కానిస్టేబుల్ మృతి
రాయగడ: మారు రథయాత్రలో విధులు నిర్వహిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై కానిస్టేబుల్ మృతి చెందాడు. మృతుడు జిల్లాలోని పద్మపూర్ సమితి ఇఛ్చామొనొగుడ గ్రామానికి చెందిన తరణీ చరన్ గొమాంగో(50)గా గుర్తించారు. స్థానిక కొత్త బస్టాండ్ కూడలిలో రథయాత్రను పురస్కరించుకుని ట్రాఫిక్ నియంత్రణ చర్యల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న గొమాంగో శనివారం సాయంత్రం 7.30 గంటల సమయంలో అస్వస్థతకు గురై కింద పడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఒకేరోజు ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి చెందడంతో పోలీసు వర్గాల్లో తీవ్ర వేదన కనిపించింది.