
విద్యుత్ చార్జీలను తగ్గించాలి
అరసవల్లి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై చార్జీల పేరుతో మోపుతున్న భారాన్ని వెంటనే తగ్గించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని ఎస్‌ఈ కార్యాలయం వద్ద అఖిలభారత యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు బొత్స సంతోష్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా, నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ధరలను పెంచబోమని మాటిచ్చి ఇప్పుడు దఫదఫాలుగా పెంచుతూ పోతోందని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఈ నిర్ణయాలను ఉససంహరించుకోవాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఎం కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆదిత్యుని సన్నిధిలో
ఈపీడీసీఎల్ డైరెక్టర్
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ టి.వి.సూర్యప్రకాష్ శనివారం దర్శించుకున్నారు. జిల్లా సర్కిల్ విద్యుత్ శాఖ ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తితో పాటు ఆలయ అధికారులు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అర్చకులు మాధవ్‌శర్మ, ఆలయ అధికార సిబ్బంది బిఎస్.చక్రవర్తి తదితరులు ఆలయ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఆపరేషన్స్ ఈఈ పైడి యోగేశ్వరరావు, డిప్యూటీ ఈఈ చల్లా వెంకటేశ్వరరావు, డీ–1 ఏఈ సురేష్‌కుమార్, జిల్లా విద్యుత్ కాంట్రాక్టర్ల సంఘ అధ్యక్షుడు ఉంగటి పాపారావు పాల్గొన్నారు.
విశ్రాంత ట్రెజరీ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా తవిటన్న
శ్రీకాకుళం పాతబస్టాండ్: పదవీ విరమణ పొందిన ట్రెజరీ ఉద్యోగులు శనివారం సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఉద్యోగ విరమణ చేసిన తరువాత వచ్చే ఇబ్బందులు, సంక్షేమాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు టీఆర్‌ఈడబ్ల్యూఏ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రెజరీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా అంకడాల తవిటన్న, ఉపాధ్యక్షుడిగా భీష్మాచార్యులు, కార్యదర్శిగా రామకృష్ణ, సంయుక్త కార్యదర్శిగా ఎ.కోటేశ్వరరావు, కోశాధికారిగా ఆర్‌ఎస్ పట్నాయక్‌లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా చీఫ్ ట్రెజరీ ఆఫీసర్ రామచంద్రయ్య, డిప్యూటీ ట్రెజరీ ఆఫీసర్ వెంకటరావు పాల్గొన్నారు.
నేడు జిల్లా అండర్–15 చెస్ ఎంపిక పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి అండర్–15 బాలబాలికల చెస్ ఎంపిక పోటీలు ఆదివారం జరగనున్నాయని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బగాది కిషోర్, కార్యదర్శి జామి రమేష్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని నానుబాలవీధిలోని చెస్ శిక్షణా కేంద్రంలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇక్కడ ఎంపికై న వారిని త్వరలో విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డుతో ఎంపికల్లో పాల్గొనాలని, పూర్తి వివరాలకు 99125 59735 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఏపీచెస్.ఓఆర్జీ వెబ్‌పోర్టల్‌లో వివరాలను నమోదుచేసుకోవచ్చని పేర్కొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త
కార్యదర్శిగా బొడ్డేపల్లి రమేష్‌కుమార్
ఆమదాలవలస: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఆమదాలవలస పట్టణానికి చెందిన బొడ్డేపల్లి రమేష్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అధిష్టానం శనివారం ప్రకటన విడుదల చేసింది. ఈయన 2013 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు రమేష్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు.
ఆప్కో వస్త్రాలపై రాయితీ
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆప్కో షోరూంలలో ఆషాఢ మాసం సందర్భంగా అన్ని రకాల చేనేత వస్త్రాలపై 30 శాతం, ఎంపిక చేసిన వస్త్రాలపై 50 నుంచి 70 శాతం ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నట్లు డివిజనల్ మార్కెటింగ్ అధికారి అనుపమదాస్ శనివారం తెలిపారు. ధర్మవరం, మాధవరం, వెంకటగి, ఉప్పాడ, బందరు, రాజమండ్రి, మంగళగిరి చీరలు, బెడ్‌షీట్స్, లుంగీలు, టవల్స్ అందు బాటులో ఉన్నాయని వివరించారు. ఆప్కోహేండ్‌లూమ్స్.కామ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆన్‌లైన్ స్టోర్స్‌లోనూ ఆప్కో వస్త్రాలు లభి స్తాయని తెలిపారు. వస్త్రాలు కొనుగోలు చేసి చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలని కోరారు.

విద్యుత్ చార్జీలను తగ్గించాలి

విద్యుత్ చార్జీలను తగ్గించాలి