
సమావేశంలోనే గుండెపోటుతో ఆశకార్యకర్త మృతి
మల్కన్‌గిరి: సమావేశంలోనే గుండెపోటుకు గురై ఆశ కార్యకర్త ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా ఖోయిర్‌పూట్ సమితి కార్యాలయంలో చోటుచేసుకుంది. ఆరోగ్యపధ్ శిక్షణ కార్యక్రమంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఖోయిర్‌పూట్ సమితి కేంద్రంలో గురు, శుక్రవారాల్లో ఆరోగ్యపధ్ శిక్షణ శిబిరాన్ని నిర్వహించాుర. ముదిలిపోడ పంచాయతీకి చెందిన మంగులి కిర్సని (43) హాజరైంది. శిక్షణ సమయంలో సహోద్యోగులతో నవ్వుతూ అప్పటివరకు ఆనందంగా ఉన్న ఆమె గురువారం సాయంత్రం స్పృహతప్పి పడిపోయింది. ఆమెను వెంటనే తోటి ఉద్యోగులు ఖోయిర్‌పూట్ ఆరోగ్య కేంద్రానికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు చెప్పారు. దీంతో తోటి కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదానికి గురయ్యారు. కాగా శుక్రవారం ఆశ వర్కర్ల సంఘం ప్రతినిధులు మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ కార్యాలాయనికి వచ్చి తమతో పని చేసి మంగులి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. రూ. 5 లక్షలు పరిహారం ఇవ్వాలని, పిల్లలు ఉండేందుకు ఇల్లు, పిల్లల చదువుకు ప్రభుత్వ సహయం, కుటుంబంలో ఒకరికు ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రాన్ని అందజేశారు.

సమావేశంలోనే గుండెపోటుతో ఆశకార్యకర్త మృతి