
ఘనంగా వనమహోత్సవం
జయపురం: కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం వారు, జయపురం అటవీ డివిజన్ సహకారంతో శుక్రవారం నుంచి మహోత్సవ వారోత్సవాలను ప్రారంభించారు. జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ అధ్యక్షులు ప్రదీప్ కుమార్ మహంతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో జీవరాశి మనుగడకు చెట్లు ఎంతో అవసరం అన్నా రు. ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లా జడ్జి పర్యవేక్షణ లో జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి మొ దట మొక్కలు నాటి వనమహోత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో సీనియర్ విచారపతి స్వయం ప్రకాశ్ దాస్, జిల్లా న్యాయసేవా ప్రదీకరణ కార్యదర్శి ప్రద్యామయి సునీత, సివిల్ కోర్టు రిజస్ట్రార్ విష్ణు ప్రసాద్ బెహర పాల్గొన్నారు.