
బహుడాకు రథాలు సిద్ధం
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని రథయాత్ర ఆద్యంతాలు యుద్ధ సన్నాహమే. భక్తి శ్రద్ధల మేళవింపుతో స్వామి యాత్ర అత్యంత ఉత్సాహభరితంగా కొనసాగుతుంది. స్వామి భక్తులు విభిన్నం. భగవంతుని అపురూప దర్శనం కోసం పరిమితం కాకుండా భక్తి భావోద్వేగంతో స్వామి యాత్రలో అడుగడుగున ప్రత్యక్ష పాత్రధారులుగా పాలుపంచుకుంటారు. అగణిత భక్త జనం మధ్య స్వామి ఆప్యాయ అనురాగాలతో యాత్రలో పాల్గొంటాడని వీరి విశ్వాసం. ఇదే స్ఫూర్తితో శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణ నుంచి శ్రీ గుండిచా నక్కొ చొణ ద్వారం ఆవరణకు యాంత్రిక, సాంకేతిక వినియోగం లేకుండా 3 భారీ రథాల్ని సురక్షితంగా గమ్యం చేర్చారు. ఇదే తరహాలో మారు రథ యాత్రకు 3 రథాలు సిద్ధమయ్యాయి. వర్షం ప్రభావంతో బుధవారం నాడు ప్రారంభించిన రథాల మలుపు కార్యక్రమం పాక్షికంగా పూర్తయ్యింది. శ్రీ జగన్నాథుని నందిఘోష్ రథం లాగే సమయానికి కుండపోత వాన కురవడంతో వాయిదా పడింది. మరునాడు గురువారం ఉదయం నందిఘోష్ రథాన్ని లాగి శ్రీ గుండిచా నక్కొచొణ ద్వారం ముంగిటకు పోలీసు జవానులు చేర్చారు.

బహుడాకు రథాలు సిద్ధం

బహుడాకు రథాలు సిద్ధం