
లైంగిక దాడి కేసులో ఒకరి అరెస్టు
జయపురం: జయపురంలో ఉంటున్న హర్యానకు చెందిన మహిళపై జరిగిన లైంగిక దాడిలో కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు మహిళా పోలీసు అధికారి ఆశ్రిత ఖాల్‌కో బుధవారం వెల్లడించారు. అరెస్టయిన వ్యక్తి స్థానిక మహాత్మా గాంధీ రోడ్డు గాంధీచౌక్ పరిదికి చెందిన దేవ్ సోనిగా తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచామన్నారు. కోర్టు బెయిల్ నిరాకరించటంతో జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. పోలీసు అధికారి తెలిపిన వివరాలు ప్రకారం.. జయపురం సమీప బరిణిపుట్‌లోని రాహుల్ గర్గ్ షోరూంలో హర్యానకు చెందిన మహిళ పని చేస్తూ.. పట్టణంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. గతనెల 28వ తేదీ రాత్రి సమయంలో జయపురం రథాయాత్ర తిలకించేందుకు ఆమె వెళ్లింది. మార్గమధ్యలో దేవసోని కలిశాడు. అనంతరం వారంతా రథాయాత్ర చూసి అందరూ ఇంటికి వచ్చారు. ఆ మహిళ తన ఇంటిలో దుస్తులు మార్చుకుంటున్న సమయంలో దేవ్ సోని వచ్చి ఆమైపె దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అరిస్తే చంపుతానని బెదిరించి అక్కడ నుంచి పారిపోయాడు. బాధిత మహిళ జయపురం మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి నిందితుని అరెస్టు చేశామన్నారు. ఈ సంఘటనలో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు అధికారి వెల్లడించారు.