
బురదలో కూరుకుపోయిన అంబులెన్స్
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి నాకమామ్ముడి పంచాయతీ హతీహాంబ్ గ్రామం నుంచి గంధిగూఢకు వెళ్లే రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాజగా గంధిగూఢ గ్రామం నుంచి ఓ రోగిని బుధవారం తరలిస్తున్న అంబులెన్స్ బురదలో కూరుకుపోయింది. దీంతో గంటసేపు రోగి అంబులెన్స్ ఇబ్బందిపడ్డాడు. ఇంతలో ట్రాక్టర్‌కు తాడును కట్టి దాని సహాయంతో అంబులెన్స్‌ను బురదలో నుంచి బయటకు తీశారు. అనంతరం రోగిని కోరుకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రభుత్వం స్పందించి తమ గ్రామాలకు పక్కా రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.