
● ప్రజా సేవలు బంద్
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాలో బుధవారం ప్రజా సేవలు స్తంభించాయి. భువనేశ్వర్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్‌లో జాయింట్ కమిషనర్ రత్నాకర్ సాహుపై బీజేపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశారు. రత్నకర్ సాహు అత్యధిక కాలం నబరంగ్‌పూర్, కొరాపుట్ జిల్లాలో పని చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో హత్యాయత్యాన్ని నిరసి స్తూ నబరంగ్‌పూర్ జిల్లాలో ఓఏఎస్ అధికారులు మూకుమ్మడి సెలవు పెట్టారు. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రోకి అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ప్ర భుత్వ కార్యాలయాలలో ప్రజలకు సేవలు నిలిచి పోయాయి. కొరాపుట్ జిల్లా కేంద్రంలో ఓఏఎస్ అధికారులు భారీ వర్షంలో ర్యాలీ నిర్వహించారు. తమ సహచర ఓఏఎస్ అధికారిపై జరిగిన దాడిని ఖండించారు. భద్రత లేకుండా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లలేమని నినాదాలు చేశారు. ఉద్యోగులు విధుల్లో లేకపోవడంతో జిల్లాస్థాయి ముఖ్య కార్యాలయాలు వెలవెలబోయాయి. జయపూర్‌లో రెవెన్యూ ఉద్యోగుల సంఘం అత్యవసర సమావేశం నిర్వహించి దాడులను సహించమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై రాజకీయ పార్టీల కార్యకర్తల దాడులను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర రెవెన్యూ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తిరుపతి బాలాజీ సాహు నబరంగ్‌పూర్‌లో మాట్లాడుతూ.. రత్నకర్ సాహుకి తాము అండగా ఉన్నామని ప్రకటించారు.
మున్సిపల్ అధికారిపై బీజేపీ
కార్తకర్తల దాడి నేపథ్యంలో మూకుమ్మడి సెలవులో ఉద్యోగులు

● ప్రజా సేవలు బంద్

● ప్రజా సేవలు బంద్