
● చిత్రకారులకు ఘన సత్కారం
జయపురం: స్థానిక విక్రమ ఆర్ట్స్ అండ్ క్రాఫ్టు కళాశాలలో రథాయాత్ర సందర్భంగా నిర్వహించిన ధారుదేవత చిత్రాల వర్క్‌షాపుల్లో పాల్గొని జగన్నాథుని వివిధ రూపాలతో విద్యార్థులు వేసిన చిత్రలను సిమ్మాద్రి మహారాణ కళా భవనంలో బుధవారం ప్రదర్శించారు. ఈ చిత్రాలతో పాటు డాక్టర్ పరేష్ రథ్ ప్రదర్శించిన జయపురం చారిత్రిక చిత్రాల ప్రదర్శన కూడా ఈ భవనంలోనే జరుగుతోంది. ఈ ప్రదర్శనలో ధారు దేవతపై 40 చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో చిత్ర కారులైన విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే బాహిణీపతి ప్రశంసా పత్రాలతో సన్మానించారు. ఈ ప్రదర్శన ఈ నెల ఐదో తేదీ వరకూ నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ ఝుధిష్టర్ మల్లిక తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిత్ర కళలో విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. ఒడిశాలో ప్రథమ శ్రీవిక్రమ అర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కళాశాలను ఇంకా అభివృద్ధి చేయాలని.. అందుకు తాను చేయూతనిస్తానని అన్నారు. కార్యక్రమంలో కొరాపుట్ భారతీయ జాతీయ కళా సాంస్కృతిక చారిత్రిక ట్రస్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రఫుల్ల చంద్ర మహారాణ, కొరాపుట్ కోట్స్ (కౌన్సిల్ ఆఫ్ అనాలిటికల్ ట్రైబుల్ స్టడీష్) అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పరేష్ రథ్ పాల్గొన్నారు. అతిథులకు ధారుదేవత చిత్రాలను నిర్వాహకులు అందజేశారు.

● చిత్రకారులకు ఘన సత్కారం

● చిత్రకారులకు ఘన సత్కారం