
విమానాశ్రయంలో మాక్ డ్రిల్
భువనేశ్వర్: స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర మాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించారు. ఆపత్కాల పరిస్థితుల్ని సమర్థంగా ఎదుర్కోవడంలో విమానాశ్రయం యంత్రాంగం సన్నద్ధతను అంచనా వేసేందుకు ఈ కసరత్తు నిర్వహించారు. ఆకస్మిక విపత్తు నిర్వహణలో ప్రతిస్పందన బృందాల మధ్య సమన్వయం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. ఇలాంటి కసరత్తులు భద్రతా చర్యలను బలోపేతం చేస్తాయి. సిబ్బందిలో ఆత్మ విశ్వాసాన్ని దృఢపరచి సంభావ్య సంక్షోభాలకు వేగవంతమైన, ప్రభావవంతమైన ప్రతిస్పందనను నిర్ధారిస్తాయని నిర్వాహక వర్గం తెలిపింది.

విమానాశ్రయంలో మాక్ డ్రిల్

విమానాశ్రయంలో మాక్ డ్రిల్

విమానాశ్రయంలో మాక్ డ్రిల్