
పట్టణ సమస్యలపై అధికారులకు వినతి
జయపురం: జయపురం ప్రజల సమస్యలతో పాటు ఇతర సామాజిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ఉద్యమించాలని జయపురం సిటిజన్ కమిటీ తీర్మానించింది. స్థానిక సిటిజన్ కమిటీ భవనంలో సోమవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో పట్టణ సమస్యలపై సుధీర్ఘంగా చర్చించింది. పట్టణంలో గల డ్రైనేజ్ సిస్టమ్‌ను స్వరేజ్ డ్రైన్ సిస్టంలో మమేకం చేయాలని, పోస్టల్ కార్యాలయాన్ని పునః ప్రారంభించాలని, పట్టణంలో రైల్వే టిక్కట్లు అమ్మే కౌంటర్ ఏర్పాటు, సర్దార్ పటేల్ మార్గంలో (మైన్ రోడ్డు)లోమహిళల కోసం ఆధునిక శైచాలయం ఏర్పాటు చేయాలని, సీనియ ర్ సిటిజనులకు గురింపు కార్డులు సమకూర్చాలని, పట్టణంలో భూమి రికార్డు కార్యాలయం ఏర్పాటు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మున్సిపాలిటీ వారిచే జనన, మరణ ధ్రువ పత్రాలు సమకూర్చే ఏర్పాటు చేయాలని, పట్టణ రెండవ మార్కెట్ పూర్తి స్థాయి లో నిర్వహించాలని, జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులను నియమించాలని, ఆల్ట్రా సౌండ్ సౌకర్యం అందరు రోగులకు కల్పించాలని లిఖిత పూర్వకంగా డిమాండ్ చేయాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో సిటిజన్ కమిటీ అధ్యక్షులు బినోదిణీ శాంతపాత్ర, కార్యదర్శి జి.వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు మదన మోహననాయిక్, సలహాదా రు సత్య భాను పండ, కార్యవర్గ సభ్యులు భీమ సేన్ అగర్వాల్, దేవేంధ్ర బాహిణీపతి, పి.మహేశ్వరరా వు, పరమేశ్వర పాత్రో, రత్నాకర చౌధురి, జి.బి.రావు, భవానీ ఆచార్య, గీతా ప్రకాశ మిశ్ర, నరసించౌదురి పాల్గొన్నారు.