
హెచ్‌ఎంను బదిలీ చేయాలని ఆందోళన
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి గడ్డిశెశిఖాల్ పంచాయతీలొని మండలపితేసు గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలను బదిలీ చేయాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సోమవారం పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేసారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 15 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ హెచ్‌ఎంతోపాటు మరొకరు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానోపాధ్యాయురాలు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఉన్న ఒక ఉపాధ్యాయురాలు కూడా అప్పుడప్పుడు విధులకు హాజరవుతుండడంతో తమ పిల్లలు పాఠాలు నేర్చేందుకు కష్టతరమవుతుందని.. ఇదే కొనసాగితే పిల్లల భవిష్యత్ అగమ్య గోచరంగా మారుతుందని వారంతా అన్నారు. ఈ నేపథ్యంలో హెచ్‌ఎంను బదిలీ చేస్తే పాఠశాలలో చదువులు మెరుగుపడతాయని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
యాత్ర కోసం వెళ్లిన
యువకుడు శవమయ్యాడు!
రాయగడ: జగన్నాథ రథయాత్ర చూసేందుకు వెళ్లిన యువకుు శవమై దర్శనమించారు. జిల్లా లోని బిసంకటక్ పోలీస్ స్టేషన్ పరిధి దుర్గి సమీపంలోని మామిడి తోటలో యువకుని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు డుమునిలి పంచాయతీ లొట్టగుడ గ్రామానికి చెందిన జొగులు కలక కుమారుడు పింటూ కలక (21)గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వివరాల్లోకి వెళితే.. జూన్ 27వ తేదీన జగన్నాథ రథాయత్ర చూసేందుకు పింటు బిసంకటక్ వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. అయితే యాత్ర ముగిసి మూడు రోజులు అవుతున్నా ఇంటికి తిరిగి రాకపొవడంతో బిసంకటక్ పోలీస్ స్టేషన్‌లో పింటు తండ్రి జోగులు ఫిర్యాదు చేశారు. అయితే ఆదివారం డుమునిలి –దుర్గి సమీపంలో దుర్గంధం వెదజల్లడంతో అటువైపుగా వెళుతున్న కొందరు మామిడితోటలోకి వెళ్లి చూడగా.. యువకుడు ఉరివేసుకుని చనిపోయి ఉండటాన్న చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహం పింటుదిగా గుర్తించి వెంటనే కుటుంబీకులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
పాఠశాల ముందు ఆందోళన చేస్తున్న గ్రామస్తులు