
● ప్లేట్లు ఊడుతున్నాయ్!
కొరాపుట్: ఇనుప వంతెన ప్లేట్లు ఊడుతున్నా అధికారులు పట్టించు కోవడంలేదు. కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితి కుమలి కమత రోడ్డు మార్గంలో హోర్దలి వద్ద నదిపై ఇనుప వంతెన ఉంది. దానిపై వెళ్తున్న వాహనాల వలన ప్లేట్లుకి ఉన్న నట్లు, బోల్టులు ఊడిపోతున్నాయి. ఇలా ఒక్కొక్కటి ఊడుతుండడ తో ఇనుప ప్లేట్లు వదులుగా మారాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తే ప్లేట్లు నదిలో పడి పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వర్షాకాలం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటున్నారు. అధికారులు స్పందించి ప్లేట్లు ఊడిపడిపోకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

● ప్లేట్లు ఊడుతున్నాయ్!