బరిపద రథ యాత్ర ప్రత్యేకం | - | Sakshi
Sakshi News home page

బరిపద రథ యాత్ర ప్రత్యేకం

Jun 30 2025 7:23 AM | Updated on Jun 30 2025 7:23 AM

బరిపద

బరిపద రథ యాత్ర ప్రత్యేకం

భువనేశ్వర్‌: రథయాత్రలో మహిళలకు కీలక పాత్ర కల్పించి భగవంతుని సేవలో అందరికీ సమాన అవకాశం భావానికి ప్రాణం పోస్తోంది మయూర్‌భంజ్‌ జిల్లా బరిపద ప్రాంతంలో స్వామి రథ యాత్ర. పలు విభిన్నతలతో ఈ ప్రాంతంలో యాత్ర కొనసాగడం విశేషం. శ్రీ జగన్నాథుని సంస్కృతిలో ఇమిడి ఉన్న ఆచార వ్యవహారాలతో శ్రీక్షేత్రంలో వార్షిక రథ యాత్ర తరహాలో నిర్వహిస్తారు. పూరీలో యాత్ర జరిగిన మర్నాడు బరిపదలో శ్రీ జగన్నాథ రథ యాత్ర జరుగుతుంది. ఇక్కడ యాత్ర వరుసగా రెండు రోజులు కొనసాగడం మరో విభిన్నత. ఇక్కడ రథాలను మహిళలు లాగుతారు. ఇలా ఆచార వ్యవహారాల్లో వివాదరహిత నిర్వహణతో ఏటా రథ యాత్రని జరుపుకుంటున్న బరిపద ప్రాంతం ద్వితీయ శ్రీక్షేత్రంగా పేరొందింది. దేవీ సుభద్ర రథాన్ని మహిళలు మాత్రమే లాగుతారు. ఈ ఆచారం సీ్త్ర సాధికారతను చాటుతుంది. భగవంతుని కార్యకలాపాల్లో లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. బరిపద రథ యాత్ర ఆధ్యాత్మిక సహవాసం, సాంస్కృతిక ఐక్యతతో జనం అంతా లీనం అయ్యే అనుభవాన్ని ప్రసాదిస్తుంది. ప్రఖ్యాత పూరి రథ యాత్ర తర్వాత రోజు బరిపదలో రథ యాత్ర జరుగుతుంది. ఇదో ప్రత్యేక సంప్రదాయం ద్వారా విభిన్నంగా ప్రాచుర్యం సంతరించుకుంది. రథ యాత్ర సాధారణంగా ఒక నిర్దిష్ట కాలంలో జరుగుతుంది. ఏటా ఆషాఢ కృష్ణ అమావాస్య రోజున జరిగే నేత్ర ఉత్సవంతో ప్రారంభమవుతుంది. ఆషాఢ శుక్ల ప్రతిపద నాడు ఉభా యాత్ర జరుగుతుంది. ఈ యాత్ర ప్రయాణానికి దేవతల సన్నద్ధతకు సంకేతం. ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు శ్రీ మందిరం నుంచి వరుస క్రమంలో (గొట్టి పొహొండి) మూల విరాట్లు రథాల్ని అధిరోహించి శ్రీ గుండిచా మందిరానికి యాత్రగా తరలి వెళ్తారు. శారదా బాలి ప్రాంతంలో శ్రీ గుండిచా ఆలయం అడపా మండపంపై దేవతా మూర్తుల దర్శనం పరమ పావనంగా పరిగణిస్తారు. యాత్రలో ఆబాలగోపాలం మూల విరాట్లు ఆసీనులైన రథాల్ని లాగుతారు. తిరుగు యాత్ర బహుడా సందర్భంగా కూడ ఇదే శైలి కొనసాగుతుంది. బరిపదలో మాత్రం దేవీ సుభద్రని మహిళలు మాత్రమే లాగడం విభిన్నం. ఇక్కడ రథ యాత్ర రెండు రోజులు జరుగుతుంది. నేత్రోత్సవం తర్వాత రథాలపైకి దేవుళ్లని తరలించిన మర్నాడు రథాలు లాగుతారు. పూరీలో యాత్ర జరిగే రోజున బరిపదలో దేవతలు రథాల్ని అధిష్టించడంతో ముగుస్తుంది. మర్నాడు రథాలు లాగేంత వరకు దేవతల్ని రథాలపై సర్వులు దర్శించుకునేందుకు పూర్తి అవకాశం కల్పిస్తారు. రథాలపై దేవుళ్ల దర్శనం కోటి జన్మల పుణ్య ఫలంగా భక్తజనం భావిస్తారు.

మహిళా సాధికారతకు తార్కాణం

బరిపద రథ యాత్ర ప్రత్యేకం 1
1/2

బరిపద రథ యాత్ర ప్రత్యేకం

బరిపద రథ యాత్ర ప్రత్యేకం 2
2/2

బరిపద రథ యాత్ర ప్రత్యేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement