
● మత్స్య, కూర్మ అవతారంలో జగన్నాథ, బలరాములు
పర్లాకిమిడి: పట్టణంలోని గుండిచామందిరంలో ఆదివారం శ్రీజగన్నాథ, బలరాములు మత్స్య, కూర్మావతారంలో భక్తులకు కనువిందు చేశారు. సెలవు దినం కావడంతో మధ్యాహ్నం నుంచి చట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వామివారి దర్శనానికి భారీగా విచ్చేస్తున్నారు.
రాయగడ: రథాయాత్ర మూడో రోజైన ఆదివారం జగన్నాథుడు కూర్మావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. గుండిచా మందిరంలో కొలువైయున్న దేవతామూర్తులు ప్రత్యేక పూజలను అందుకుంటున్నారు. సుప్రభాత సేవతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు స్వామివారు రోజుకో రూపంలో భక్తులకు దర్శన భాగ్యం కలిగేలా సేవాయుతులు అలంకరిస్తున్నారు. స్వామివారి దశవతారాల్లో భాగమైన కూర్మావతారాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. గుండిచా మందిరం ప్రాంగణం భక్తులతో కిటకిట లాడుతుంది. ఇదిలాఉండగా సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, భజన, సంకీర్తనలు కళాకారులచే నిర్వహించారు.

● మత్స్య, కూర్మ అవతారంలో జగన్నాథ, బలరాములు