
ఘోర రోడ్డు ప్రమాదం
● ముగ్గురు యువకులు మృతి
కొరాపుట్: ఒక కుటుంబానికి చెందిన చేతికందివచ్చిన యువకులు ఒకేసారి మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం వేకువజామున నబరంగ్‌పూర్ జిల్లా జొరిగాం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జొరిగాంకు చెందిన చంపక్ లాల్ జైన్ కుమారుడు సాగర్ జైన్ (21), మహావీర్ జైన్ కుమారుడు అంకుర్ జైన్ (22), మన్మోహన్ జైన్ కుమారుడు క్రిష్ జైన్ (18)లు మృతి చెందారు. వీరంతా కారులో పుప్పుగాం రోడ్డులో వెళ్తుండగా దినేగుడ గ్రామం వద్ద బురద వలన వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంట నే సాగర్ జైన్, అంకుర్ జైన్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన క్రిష్ జైన్‌ని పోలీసులు అస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతులు తండ్రులు ఇద్దరు అన్నదమ్ములు కాగా, మరో వ్యక్తి ఇదే కుటుంబానికి చెందిన వ్యక్తి. ముగ్గురు యువకులు వారి తల్లిదండ్రులకు ఒకే ఒక్క కుమారులు కావడం విచారకరం.

ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం