రథయాత్ర ఏర్పాట్లపై క్షేత్రస్థాయి సమీక్ష
కొరాపుట్: దక్షిణ ఒడిశా పూరీగా పిలవబడుతున్న కొరాపుట్ జిల్లా కేంద్రంలోని శబరి శ్రీక్షేత్రంలో జరిగే రథయాత్ర ఏర్పాట్లపై కలెక్టర్ క్షేత్రస్థాయి సమీక్ష జరిపారు. శనివారం కలెక్టర్ వి.కీర్తివాసన్, ఎస్పీ రోహిత్ వర్మలు రథాలు వద్దకు వెళ్లారు. ఈనెల 27వ తేదీన జరిగే రథయాత్రలో ఎటువంటి అసౌకర్యాలు ఉండకూడదని అదేశించారు. వర్షం పడితే మురుగు కాలువల్లో నీరు రోడ్డు మీదకు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ వైర్ల మళ్లింపు, అత్యవసర వైద్య సదుపాయాలు ఉండాలన్నారు. శబరి శ్రీక్షేత్రం నుంచి గుండిచా మందిరం వరకు మూడు రథాలు క్షేమంగా చేరేందుకు మార్గాలు సుమగంగా ఉండాలని ఆదేశించారు. వారితో పాటు మున్సిపల్ చైర్మన్ లలెటెందు రంజన్ శెఠి ఉన్నారు.
రథయాత్ర ఏర్పాట్లపై క్షేత్రస్థాయి సమీక్ష


