వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి | - | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి

Jun 17 2025 5:30 AM | Updated on Jun 17 2025 5:30 AM

వైద్య

వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం వైద్యుల నిర్లక్ష్యానికి మూడేళ్ల చిన్నారి మృత్యువాతపడింది. స్థానిక 119 కాలనీలో నివాసముంటున్న లలిత్‌ పాత్రో అనే వ్యక్తి కుమార్తె రోజో సందర్భంగా తోటి పిల్లలతో కలిసి ఊయల ఊగింది. ప్రమాదవశాత్తు కిందపడటంతో తలకు గాయమైంది. వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు కనిపించలేదు. దీంతో బాలిక మృత్యువాతపడింది. సకాలంలో వైద్యం అందకే తమ కుమార్తె మృతిచెందిందంటూ బాలిక తండ్రి లలిత్‌, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి బ్రోజోమోహన్‌ దాస్‌ స్పందిస్తూ ఆదివారం కావడంతో ఒకపూట మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నారని, విధులకు రావడంతో ఆలస్యమై ఉంటుందని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

లక్ష్మీపూర్‌ జంక్షన్‌లో హైమాస్ట్‌ వెలుగులు

కొరాపుట్‌: అంతర్రాష్ట్ర ముఖ్య కూడలి లక్ష్మీపూర్‌లో హైమాస్ట్‌ వెలుగులు ప్రసరించాయి. సోమవారం సాయంత్రం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన లక్ష్మీపూర్‌ ఎమ్మెల్యే పవిత్ర శాంత పూజలు చేసి లైట్లను ప్రారంభించారు. రాయగడ–పార్వతీపురం–కొరాపుట్‌ పట్టణాలను కలిపే ప్రధాన జంక్షన్‌ కావడంతో నిత్యం ప్రయాణికులు ఇక్కడ ఉంటారు. అంధకారం వలన ప్రయాణికులు రాత్రయ్యేసరికి బితుకు బితుకు మంటున్నారు. ఈ సమస్యను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన జిల్లా కలెక్టర్‌ దృష్టికి సమస్యను వివరించడంతో స్పందించిన లైట్లు ఏర్పాటు చేశారు.

అక్రమ మద్యంపై దాడులు

కొరాపుట్‌: నబరంగ్‌పూర్‌ జిల్లా డాబుగాం సమితిలో అక్రమ మద్యంపై ఎకై ్సజ్‌, పోలీసు శాఖ సిబ్బంది సంయుక్తంగా దాడులు చేశారు. 60 లీటర్ల స్థానిక మద్యాన్ని సీజ్‌ చేశారు. అలాగే 500 లీటర్ల విప్ప పువ్వు నిల్వలను ధ్వంసం చేశారు. మద్యం వ్యాపారులు కమలా బిసోయి, గరిమణి బోత్ర, కనక గౌడలను అరెస్ట్‌ చేశారు. దాడుల్లో స్టేషన్‌ అధికారి గోపాల్‌ క్రిష్ణ అగుపాత్ర, ఎస్సై విక్రం కిషోర్‌ సాహు, ఏఎస్సై చంద్ర శేఖర్‌ హజారీ, ఎకై ్సజ్‌ సిబ్బంది సమీర్‌ కుమార్‌, శ్రీకాంత్‌ బిసోయి, గటుల్‌ నాయక్‌ పాల్గొన్నారు.

ఘనంగా రొజొ ఉత్సవాలు

రాయగడ: జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అశోక్‌ కళ్యాణ మండపంలో సోమవారం రొజొ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో యువతులకు పిండివంటలు ప్రదర్శన, ముగ్గుల పోటీలు, కబడ్డీ, స్లో సైకిల్‌ రేస్‌ వంటి పోటీలు నిర్వహించారు. జిల్లా సాంఘేక సంక్షేమ శాఖ అధికారి మీనతి దే, సీడీపీఓ మీనతీ దాస్‌ పర్యవేక్షించారు.

పిడుగు పాటుకు ఇద్దరు మృతి

రాయగడ : గుడారి పరిధిలోని భటియాబి గ్రామంలో రొజొ సంక్రాంతి సందర్భంగా వన భోజనాలు ముగించుకుని అంతా ఇంటికి సంతోషంగా వస్తున్న సమయంలో పిడుగు పడటంతో ఇద్దరు యువతులు మృతి చెందారు. మరో యువతి తీవ్ర గాయాలపాలైంది. సోమవారం జిల్లాలోని గుడారిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో సునాలి గౌడొ(24), రూపాలి గౌడొ (21)లుగా గుర్తించారు. తీవ్రగాయాలకు గురైన వ్యక్తి కాజల్‌ గౌడొగా గుర్తించారు. బాధితురాలిని గుణుపూర్‌ ఆస్పత్రికి తరలించారు.

వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి 1
1/6

వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి

వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి 2
2/6

వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి

వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి 3
3/6

వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి

వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి 4
4/6

వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి

వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి 5
5/6

వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి

వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి 6
6/6

వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement