మత్తుకు దూరంగా ఉండాలి
మల్కన్‌గిరి: మత్తుపదార్థాలకు దూరంగా ఉండాల ని అధికారులు అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాల యం ప్రాంగణంలో కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ ఆదేశాల మేరకు ఎకై ్సజ్‌శాఖ సిబ్బంది మాదక ద్రవ్యాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన చైతన్యరథాన్ని జిల్లా అదనపు కలెక్టర్ సోమనాఽథ్ ప్రధన్ బుధవారం ప్రారంభించారు. ఈ రథం ద్వారా మాదక ద్రవ్యాల వినియోగంతో వాటిల్లే నష్టంపై ఏడు సమితుల్లోని 111 పంచాయతీల్లో ప్రచారం చేయనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ అధికారి బింబధర్ పండా, సిబ్‌బంది పాల్గొన్నారు.


