
ట్రాఫిక్ హోంగార్డ్‌పై ఆటో డ్రైవర్ దాడి
రాయగడ: ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డుపై ఆటో డ్రైవర్ దాడి చేసి గాయపరిచిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆటో డ్రైవర్‌పై సదరు పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ గురువారం ఫిర్యాదు చేశారు. ఈ నెల 26వ తేదీన స్థానిక కపిలాస్ కూడలిలో ట్రాఫిక్ విధులను హోంగార్డు అశోక్ కుమార్ పాడి నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆటో డ్రైవర్ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి వస్తున్నాడు. హోంగార్డు ఆటోను ఆపి డ్రైవర్‌ను మందలించాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో హంగార్డుపై ఆటో డ్రైవర్ దాడి చేసి గాయపరిచాడు. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయింది. దీనిపై స్పందించిన పోలీసులు ఆటో నంబర్ ఆధారంగా గాలించారు. ఆటో రాయగడలోని న్యూకాలనీకి చెందినదిగా గుర్తించారు. ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నట్లు ఐఐసీ కేకేబీకే కుహోరో తెలియజేశారు. ఆటోను సీజ్ చేసిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.