
జగదల్‌పూర్‌లో ల్యాండ్‌మైన్స్ గుర్తింపు
రాయగడ: మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మునిగుడ సమితి అంబొదల పంచాయతీలోని జగదల్‌పూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్‌మైన్స్‌ను సోమవారం గుర్తించారు. డిస్టెట్ వలంటరీ ఫోర్స్ (డీవీఎఫ్), సీఆర్పీఎఫ్ నాల్గో బెటాలియన్ లకు చెందిన ప్రత్యేక దళం ఈ మేరకు మావోయిస్టులు అమర్చిన 4 ల్యాండ్‌మైన్స్ (బాంబులు)లను గుర్తించినట్లు ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ఇంటెలిజెన్స్ ఫోర్స్ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు జగదల్‌పూర్ అటవీ ప్రాంతంలో ప్రత్యేక పోలీస్ దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు అమర్చిన కుక్కర్ బాంబ్, మరో మూడు టిఫిన్ బాంబులను గుర్తించినట్లు పేర్కొన్నారు. వాటిని గుర్తించిన పోలీసు ప్రత్యేక దళం సురక్షిత ప్రాంతంలో నిర్వీర్యం చేసిందని తెలిపారు.

జగదల్‌పూర్‌లో ల్యాండ్‌మైన్స్ గుర్తింపు

జగదల్‌పూర్‌లో ల్యాండ్‌మైన్స్ గుర్తింపు