యువకుని దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

యువకుని దారుణ హత్య

May 5 2025 8:22 AM | Updated on May 5 2025 11:41 AM

యువకు

యువకుని దారుణ హత్య

రాయగడ: జిల్లాలోని పద్మపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని విక్రమ్‌పూర్‌లో శనివారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని విక్రమ్‌పూర్‌ గ్రామానికి చెందిన చైతన్య సబర్‌(48)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గుణుపూర్‌ సబ్‌ డివిజన్‌ ఆస్పత్రికి తరలించారు. శనివారం నాడు సబర్‌ ఇంటిలో మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో పొరుగింటిలో నివసిస్తున్న పొండ సబర్‌ అనే యువకుడు గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రగాయాలకు గురైన చైతన్య అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం దాడి చేసిన పొండా సబర్‌ పద్మపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. మృతుని భార్య మేలుని సబర్‌ తన భర్తను పొండ సొబొరొతొ పాటు అతని కొడుకు కూడా దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

వ్యక్తి అరెస్టు

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పోలీసులు ఆదివారం 80 లక్షలు మోసం చేసిన దేవజీత్‌ త్రిపాఠి ని అరెస్టు చేశారు. దేవజీత్‌ త్రిపాఠి అనే వ్యక్తిపై మల్కన్‌గిరి జిల్లాకు చెందిన కె.జితేంద్ర పాత్రో అనే వ్యక్తి మల్కన్‌గిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాధు చేశారు. దేవజీత్‌ జిల్లాలో పండ్ల వ్యాపారం చేస్తున్న జితేంద్రతో పరిచయం చేసుకుని 2017లో అతని నుంచి కమోడిటీ ట్రేడింగ్‌ చేస్తే మూడు నేలల్లో 20 శాతం లాభం వస్తుందని నమ్మించి కొంత డబ్బులు కట్టించి లాభం ఇచ్చాడు. మరి కొంత ఆశ చూపి వితడల వారిగా రూ.40 లక్షలు డబ్బులు కట్టించి ఏటు వంటి లాభలు ఇవ్వలేదు. జితేంద్ర వెంటనే దేవజిత్‌కు ఫోన్‌ చేసి డబ్బులు ట్రేడింగ్‌ ఖాతా వివరాలు చేప్పకుండా రూ. 22లక్షలు కట్టించాడు. మారో కొత్త ఖాతా ఓపెన్‌ చేయాలని నమ్మించాడు. ఆదార్‌ కార్డ్‌, ఇతర కార్డులు తీసుకొని మారో ఖాతా ఓపెన్‌ చేయాలని, రూ.10 లక్షలు కావాలని చేప్పి మొత్తం 80 లక్షలు వరుకు తీసుకుని పారారయ్యాడు. అతను ఈ విషయం తెలుసుకున్న జితేంద్ర కొద్ది రోజుల క్రితం ఫిర్యాదుతో బార్‌గాడ్‌లో అరేస్టు చేసి మల్కన్‌గిరికి తరలించారు. ఇక్కడ విచరణ అనంతరం సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని మల్కన్‌గిరి పోలీసులు తెలిపారు.

ఉద్యాన పంటలకు రాయితీ రెట్టింపు

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): జిల్లాలో 44250 హెక్టార్లలో ఉద్యాన పంటలను సాగు చేయడం ద్వారా 155147 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తిని రైతులు సాధిస్తున్నారని జిల్లా ఉద్యాన అధికారి రత్నాల వరప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సుదీర్ఘ తీరప్రాంతమున్న, వివిధ జీవవైవిధ్య పరిస్థితులు నెలకొని ఉన్న జిల్లాలో ఉద్యాన పంటలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక విస్తరణ పథకాలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఈ సంవత్సరం నుంచి ప్రోత్సాహకాలను గణనీయంగా పెంచుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే వివిధ పంటలను వేయదలుచుకునే రైతులను ఉద్యాన అధికారులు గుర్తించారని, తొలకరి వర్షాకాలానికి ముందే మిగిలిన రైతులని కూడా గుర్తించేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ పథకంలో ప్రత్యేకంగా డ్రాగన్‌ ఫ్రూట్‌ పంటకు ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం భారీగా పెంచిందన్నారు. గతంలో హెక్టారుకు రూ.30వేలుగా ఉన్న రాయితీని ఇప్పుడు రూ.1.62లక్షలకు పెంచడం ద్వారా రైతులకు లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు రైతు సహాయక కేంద్రంలో సంప్రదించాలని కోరారు.

యువకుని దారుణ హత్య 
1
1/1

యువకుని దారుణ హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement